Andhra Pradesh: బెజవాడ నడిబోడ్డున షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఏమైందో తెలియదు కానీ ఓ మైనర్ బాలిక ఒక్కసారిగా కాలవలోకి దూకేసింది. దీంతో స్థానికులు షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాలిక ఆచూకి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగలోకి దించారు. అయినా ఆచూకి తెలియలేదు. లోతైన విచారణ చేయగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయం వెలుగుచూసింది. గుణదల(Gunadala)లో ఈ ఘటన వెలుగుచూసింది. రైవస్ కాలవ కట్ట సమీపంలో నివశించే ఓ 17 సంవత్సరాల బాలిక చిన్నారిని ఆడిస్తోంది. ఆ చంటిబిడ్డను అక్కకి ఇచ్చేసి.. ఉన్నపలంగా కాలవవైపు పరుగులు తీసి.. అందులో దూకేసింది. బాలిక కాలవలోకి దూకడం గమనించిన ఇరుగుపొరుగు వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారంలో గుణదల పోలీసులు స్పాట్‌కు చేరకున్నారు. మిస్సైంగ్ కేసు ఫైల్ చేసి.. బాలిక ఆచూకి కోసం యాక్షన్ షురూ చేశారు. NDRF టీమ్స్ రంగంలోకి దిగాయి. 2 రోజుల పాటు ఆ ప్రాతమంతా జల్లెడపట్టినా ఎటువంటి జాడ లేదు. డౌట్ వచ్చి పోలీసులు విచారణ చేయగా.. బాలికకు ఈత బాగా వచ్చని తేలింది. ఆపై విచారణలో బాలికను ఓ రౌడీ షీటర్ ట్రాప్ చేసినట్లు తేలింది. కాలవలోకి దూకిన బాలిక.. ఈదుతూ వెళ్లి అవతలి ఒడ్డుకు చేరుకుంది. ముందస్తు ప్లానింగ్ ప్రకారం.. రౌడీ షీటర్ అక్కడ బైక్‌తో కాచుకుని ఉన్నాడు. అక్కడి నుంచి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. బట్టలు ఛేంజ్ చేసుకుని.. అక్కడి నుంచి పరారయినట్లు ఎంక్వైరీలో తేలింది. టెక్నాలజీ వినియోగించి.. నిందితుడి ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి