AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: ఇద్దరూ కలిసి కాదు.. విడి విడిగా రండీ.. చంద్రబాబు, జనసేననికి మంత్రి రోజా సవాల్..

YSRCP Plenary 2022: ఆశయం కోసం పోరాడే పులి జగన్ అని అన్నారు. ప్రతి ఆడబిడ్డ కన్నీటిని జగన్ తుడుస్తున్నారని.. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేస్తున్నారని రోజా వెల్లడించారు.

Minister Roja: ఇద్దరూ కలిసి కాదు.. విడి విడిగా రండీ.. చంద్రబాబు, జనసేననికి మంత్రి రోజా సవాల్..
Minister Roja
Sanjay Kasula
|

Updated on: Jul 08, 2022 | 4:41 PM

Share

టీడీపీలో ఆడోళ్లు తొడ కొడతారు.. మగాళ్లేమో ఏడుస్తారంటూ తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు విసిరారు మంత్రి రోజా (Minster Roja) . గుంటూరు (Guntur District) జిల్లాలో వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) మంత్రి రోజా మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి కాదని.. విడి విడిగా జగన్‌ను ఎదుర్కోవాలని రోజా సవాల్ విసిరారు.  2019 ఎన్నికల్లో జగన్ ను సీఎం కానివ్వనన్న పవన్‌ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదన్నారు. సీఎం జగన్ కటౌట్ ని చూస్తే ప్రతిపక్షానికి ఫ్యూజులు ఎగిరిపోతాయన్నారు. పవన్ కల్యాణ్ రీల్ స్టార్ అయితే జగన్ రియల్ స్టార్ అంటూ రోజా వ్యాఖ్యానించారు. జగన్, పవన్ లు కలిసి కాకుండా విడివిడి పోటీ చేయగలరా అని మంత్రి సవాల్ విసిరారు.

సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ వైసీపీ అన్నారు. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ అని విమర్శించారు. వైసీపీ జెండాలో పోరాటం ఉందని, పౌరుషం ఉందని రోజా స్పష్టం చేశారు. వైసీపీ జెండా ఎప్పుడూ తలెత్తుకుని ఎగురుతూనే ఉంటుందని.. ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న నాయకుడు వైఎస్ అని స్పష్టం చేశారు.

ఆశయం కోసం పోరాడే పులి జగన్ అని అన్నారు. ప్రతి ఆడబిడ్డ కన్నీటిని జగన్ తుడుస్తున్నారని.. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేస్తున్నారని రోజా వెల్లడించారు. వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు జగన్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచి ఈ రాష్ట్రంలోని మహిళల సంక్షేమం , సాధికారత కోసం పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు. సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో సమస్యలను ఆయన కళ్లారా చూశారని రోజా తెలిపారు.

ఏపీ వార్తల కోసం

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..