ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ జనసేన నేతల మధ్య ఉప్పు నిప్పు అన్న చందంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అంటూ ఇరు పార్టీల నేతలు మాటలతో యుద్ధం చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటంలో ప్రభుత్వ పాలనా తీరుపై, మంత్రులపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మంత్రి రోజా స్పందించారు. 2019 ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తానన్న పవన్ కళ్యాణ్ ను ఏపీ ప్రజలు శాసనసభకే కాదు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. షూటింగ్ గ్యాప్ లో వచ్చి ఏదో చేసేస్తానని మాట్లాడితే అది సినిమాల్లో బాగుంటుంది.. నిజ జీవితంలో కాదన్నారు. అవును జనసేన రౌడీసేననే… అంటూ మళ్ళీ వక్కాణించారు.. అంతేకాదు జనసేన కార్యకర్తలను చూస్తే జాలేస్తుందని.. వారు ఎప్పుడు ఏ పార్టీ జెండా మోయాలో ఎవరికీ జై కట్టాలో తెలియని పరిస్థితి జనసేన కేడర్ దంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
ఇప్పటికీ 175 స్థానాల్లో పోటీ చేసి జగన్ ప్రభుత్వాన్ని కుల్చేస్తానని చెప్పే ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదు.. తమ ప్రభుత్వం.. పవన్ తో యుద్ధానికి ఎప్పటికీ సిద్ధమేనని స్పష్టం చేశారు. పవన్ మాట్లాడడం మీడియా చూపకపోతే చుట్టుపక్కలకు కూడా పవన్ రాలేడని.. ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే పవన్ అలాంటి భాష వాడుతున్నారని పేర్కొన్నారు రోజా. పవన్ బాడీ లాంగ్వేజ్ రౌడీలాగానే ఉందని.. సాలు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ పవన్ కళ్యాణ్ లో లేవన్నారు మంత్రి ఆర్కే రోజా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..