Minister Peddireddy: వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే కేటీఆర్ పాట్లు.. పక్కవారిపై నిందలు సరికావన్న మంత్రి పెద్దిరెడ్డి

|

Apr 29, 2022 | 4:46 PM

Minister Peddireddy: తెలగాణ (Telangana)మంత్రి కేటీఆర్(Minister KTR) చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీలో (Andhrapradesh)  తీవ్ర రాజకీయంగా దుమారం రేపుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలపై ..

Minister Peddireddy: వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే కేటీఆర్ పాట్లు.. పక్కవారిపై నిందలు సరికావన్న మంత్రి పెద్దిరెడ్డి
Peddireddy Vs Ktr
Follow us on

Minister Peddireddy: తెలగాణ (Telangana)మంత్రి కేటీఆర్(Minister KTR) చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీలో (Andhrapradesh)  తీవ్ర రాజకీయంగా దుమారం రేపుతోంది. కేటీఆర్  వ్యాఖ్యలపై  ఏపీ మంత్రులు ఒకొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. ఇది ఎన్నికల స్టంట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడడంతో పక్క వారిపై అలా మాట్లాడితే ఓట్లు వస్తాయని కేటీఆర్ అనుకుంటున్నారేమో.. కానీ అలా పక్కరాష్ట్రం గురించి మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు. ఏపీలో విద్యుత్ కోత ఎక్కడా లేదని వెల్లడించారు. ఇప్పుడు ఏపిలో పవర్ కట్స్ లేవు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలకు కొంత కోత విధించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైతాంగానికి పగటిపూట 7 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో సింగరేణి ఉంది వారికి ఇబ్బంది లేదు …పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి.. ఇప్పటికే బొగ్గు దిగుమతికి టెండర్ కూడా పిలిచామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి. ఏపీలో రోడ్లను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని .. వాస్తవానికి ఏపిలో వేసినన్ని రోడ్లు తెలంగాణలో కూడా వేయలేదన్నారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వారు పక్క వారిపై నిందలు వేస్తున్నారని అలా చేయడం వలన ఓట్లు వస్తాయన్న నమ్మకం తో ఏపి పై విమర్శలు చేస్తున్నారేమో అన్నారు మంత్రి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రాభివృద్ధికి చేసింది ఏమి లేదంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. రైతులపై తుపాకులతో కాల్పులు జరిపి గతంలో పదవి కోల్పోయిన చంద్రబాబు ఈరోజు మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు మంత్రి పెద్ది రెడ్డి.

Also Read: Maharashtra: నడుస్తున్న రైలునుంచి దూకేసిన ముగ్గురు యువతులు.. లక్కంటే వీరిదే.. వీడియో వైరల్

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లో ఛార్జీలు 25 శాతానికి తగ్గింపు