AP News: ఎన్నికలవేళ కాకరేపుతున్న రాజకీయం.. ఆ నియోజకవర్గ కొత్త ఇన్‌చార్జ్‌‎కు బెదిరింపు కాల్స్..

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. మంత్రి జయరాం, ఆయన సోదరుడు నారాయణ.. స్థానిక వైసీపీ నేతలను.. బెదిరింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వార్నింగ్ ఆడియోలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

AP News: ఎన్నికలవేళ కాకరేపుతున్న రాజకీయం.. ఆ నియోజకవర్గ కొత్త ఇన్‌చార్జ్‌‎కు బెదిరింపు కాల్స్..
Minister Jayaram

Updated on: Feb 09, 2024 | 10:00 AM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. మంత్రి జయరాం, ఆయన సోదరుడు నారాయణ.. స్థానిక వైసీపీ నేతలను.. బెదిరింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వార్నింగ్ ఆడియోలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆలూరు వైసీపీ కొత్త ఇన్‌చార్జ్‌ విరూపాక్షికి మద్దతు తెలుపుతున్న లోకల్‌ వైసీపీ లీడర్లపై మంత్రి జయరాం, ఆయన సోదరుడు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. విరూపాక్షికి సపోర్ట్‌ చేస్తే చంపేస్తామంటూ మంత్రి జయరాం సోదరుడు నారాయణ రెండు రోజుల క్రితం స్థానిక వైసీపీ నేతలకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇవ్వగా.. ఇవాళ.. ఏకంగా మంత్రి జయరామే బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అరికెర వైసీపీ నేత వీరేష్‌ను మంత్రి జయరాం బూతులు తిడుతూ.. చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.ఆడియోల్లో ఇష్టారీతిన రెచ్చిపోయారు మంత్రి జయరాం.

స్థానికంగా రాజకీయాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నావు.. స్పీడ్‌కు బ్రేకులు పడతాయంటూ వైసీపీ నేత వీరేష్‌ను మంత్రి జయరాం బెదిరించారు. తాను కూడా వైసీపీలోనే ఉన్నానంటూనే వీరేష్‌ను మంత్రి జయరాం బండబూతలు తిట్టడం కలకలం రేపుతోంది. గతంలో నేముకల్లు గ్రామ సర్పంచ్‌ ప్రేమ్‌కుమార్‌ను కూడా మంత్రి జయరాం సోదరుడు నారాయణ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక.. మంత్రి జయరాం సోదరుడి బెదిరింపు కాల్స్‌పై ఆలూరు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపుల వ్యవహారంపై ఆస్పరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి సోదరుడు నారాయణ బెదిరింపులతో తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే ఆలూరు వైసీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక పోలీసులను కోరారు. నారాయణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో.. బెదిరింపు కాల్స్‌పై విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు ఆస్పరి పోలీసులు. ఇక.. స్థానిక నేతల ఆందోళనల నేపథ్యంలో మంత్రి, ఆయన సోదరుడి వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటుందన్నది కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..