Gudivada Amarnath: ఏపీలో దావోస్‌ సమ్మిట్ రగడ.. టీడీపీ నేతలకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్..

|

Jan 17, 2023 | 7:02 PM

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏదో ఒక విషయంపై అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య వేడి రాజుకుంటోంది.

Gudivada Amarnath: ఏపీలో దావోస్‌ సమ్మిట్ రగడ.. టీడీపీ నేతలకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్..
Gudivada Amarnath
Follow us on

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏదో ఒక విషయంపై అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య వేడి రాజుకుంటోంది. కాగా.. స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు ప్రభుత్వం వెళ్లకపోవడంపై టీడీపీ వైసీపీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు.. ఏపీకి ఆహ్వానం అందలేదని టీడీపీ ఫైర్ అవుతోంది. కాగా, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సుకు వెళ్లకపోవడంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. నెలన్నర కిందటే సీఎం జగన్‌కు ఆహ్వానం వచ్చిందంటూ పేర్కొన్నారు. మార్చిలో విశాఖలో బిజినెస్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఉండటం వల్లే అక్కడికి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో బోండా ఉమ చేసిన విమర్శలను మంత్రి అమర్నాథ్ ఖండించారు.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు ఆహ్వానం లేదన్నది టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనంటూ అమర్నాథ్ పేర్కొన్నారు. నవంబర్ 25వ తేదీన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందిందంటూ మంత్రి లేఖను లేఖ చూపించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ లోనే గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని వివరించారు. ఈ సమ్మిట్ కు దావోస్‌నే ఇక్కడకు తీసుకోచ్చే ప్రణాళికలు చేస్తున్నామంటూ వివరించారు. ముఖ్యమంత్రి జగన్ ముఖం చూసి పెట్టుబడిదారులు ఎవరూ రావడం లేదనే దావోస్ కు ఆహ్వానం అందలేదని వెకిలి ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఐదు సంవత్సరాల పాటు దావోస్ వెళ్లి టీడీపీ ప్రభుత్వం సాధించింది శూన్యమంటూ ఫైర్ అయ్యారు.

ఆరునెలల క్రితమే దావోస్ లో జరిగిన ఎకనమిక్ ఫోరమ్‌కు స్వయంగా ముఖ్యమంత్రి జగనే పాల్గొని గ్రీన్ ఎనర్జీకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ గుడివాడ అమర్నాథ్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..