AP Capital Issue: మూడు రాజధానులపై ఏపీ మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్.. పూర్తి వివరాలు

|

Mar 05, 2022 | 5:17 PM

పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) మరోసారి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులకే..

AP Capital Issue: మూడు రాజధానులపై ఏపీ మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్.. పూర్తి వివరాలు
botsa on three capitals
Follow us on

పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) మరోసారి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులకే(Three capitals) కట్టుబడి ఉందని చెప్పారు. ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కావని వెల్లడించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని బొత్స స్పష్టం చేశారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంటుకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు(AP HIgh Court) వచ్చిందని, దీనిపై విస్తృత చర్చ జరగాలన్నారు. జిల్లాల పునర్విభజనపై వస్తున్న విజ్ఞప్తులను కమిటి పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుందని మంత్రి బొత్స వివరించారు.

రాజధాని అంశంపై హైకోర్టు తీర్పు..

అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని వెల్లడించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించింది. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపైనా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స స్పందన..

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికార వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని, అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తామని వెల్లడించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని, పార్లమెంటుకు విరుద్ధంగా వచ్చిన తీర్పుపై విస్తృత చర్చ జరగాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టం అమలుకు తాము వ్యతిరేకం కాదు. చట్టంలోని అంశాలను అమలు చేసేది లేదని చెప్పట్లేదు వివరించారు. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనఖా పెట్టారని వ్యాఖ్యానించారు.

Also Read

Mahesh Babu: బాబు బంగారం.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మహేష్ మరో అడుగు..

Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..

NHM Gadwal Recruitment: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగుస్తున్న గడువు!