Minister Botsa: ప్రభుత్వం చేసే ప్రతి పైసా అప్పుకూ లెక్కలున్నాయి.. మంత్రి బొత్స కీలక ప్రకటన

|

Mar 31, 2022 | 2:35 PM

భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా...

Minister Botsa: ప్రభుత్వం చేసే ప్రతి పైసా అప్పుకూ లెక్కలున్నాయి.. మంత్రి బొత్స కీలక ప్రకటన
botsa on three capitals
Follow us on

భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. 2023 నాటికి భూ సర్వే (Land Survey) పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సొంత భూములే కాకుండా, గ్రామకంఠాలు భూములను సర్వే చేస్తున్నామన్న మంత్రి.. మరో 100 ఏళ్ల వరకు భూములపై ఏ విధమైన సమస్యలు లేకుండా చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. ఇష్టారీతిన ఛార్జీలు(Power Charges) పెంచలేదని, ప్రతిపాదనలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి పైసా అప్పుకూ తమ వద్ద లెక్కలున్నాయని అన్నారు. బషీరాబాగ్ లో కాల్పులు చంద్రబాబు హయాంలోనే జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చంద్రబాబు ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని కోరారు.

స్వాతంత్ర్యం  వచ్చాక భూ సర్వే జరగలేదు. సర్వే జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ ఈ కార్యక్రమం చేపట్టారు. అన్ని రకాల భూ సమస్యలు దీని ద్వారా పరిష్కరం ఆవుతాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో ప్రజలకు తెలుసు.గత ఐదేళ్లు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచలేదా..? బషీర్ బాద్ కాల్పులు ఎవరి హయాంలో జరిగాయి. రైతులు చనిపోడానికి చంద్రబాబు కారణం కాదా. పీఆర్సీ ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. గత ఐదేళ్లు ఏమి జరిగిందో.. ఇప్పుడు ఏమి జరుగుతోంది అనేది ప్రజలే చెబుతారు.

                   – బొత్స సత్యనారాయణ, మంత్రి

Also Read

Tirumala: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ద‌ర్శన టోకెన్లు వాయిదా.. మళ్ళీ ఎప్పటి నుంచి TTD జారీ చేయనున్నదంటే

Spring Season: ట్రెక్కింగ్‌కు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? బెస్ట్‌ ప్లేసెస్‌ ఇవే..

Pranitha: డాక్టర్ ఆత్మహత్య.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ ప్రణీత..