AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Dam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్న మంత్రి అంబటి

శ్రీశైలం (Srisailam) జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులు ఉన్నట్లు అధికారులు...

Srisailam Dam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్న మంత్రి అంబటి
Srisailam Dam
Ganesh Mudavath
|

Updated on: Jul 23, 2022 | 8:04 AM

Share

శ్రీశైలం (Srisailam) జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలు గా ఉంది. ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 57,751 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. కాగా.. ఎడమ గట్టు, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇవాళ ( శనివారం ) ఉదయం 11 గంటలకు రేడియల్ క్రేస్ట్ గేట్ల ద్వారా మంత్రి అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు.

మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుల చేస్తుండటంతో శ్రీశైలానికి భారీగా ప్రవాహం వస్తోంది. డ్యామ్ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇవాళ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరచి నీటి విడుదల ప్రారంభించనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి రావద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో
అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్
అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్