Ambati on Pawan: కాపులూ జాగ్రత్త.. పవన్ కళ్యాణ్ బాబు పల్లకి మోయిస్తాడు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటున్నారు.. అంతేకాదు ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ గొడ్డు చాకిరీ చేస్తున్నారని.. నిజానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం  మంత్రి కాలేడంటూ చంచలన కామెంట్స్ చేశారు మంత్రి అంబటి. పవన్ కళ్యాణ్ కాపులతో బాబు పల్లకిని  మోయిస్తాడంటూ కామెంట్ చేశారు. 

Ambati on Pawan: కాపులూ జాగ్రత్త.. పవన్ కళ్యాణ్ బాబు పల్లకి మోయిస్తాడు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు..
Ambati On Pawan Kalyan

Updated on: May 02, 2023 | 7:53 AM

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి లో సచివాలయం, ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం, షాది ఖానా శంకుస్థాపన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపులపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సైకిల్ తొక్క లేని చంద్రబాబు, ఆ సైకిల్ తొక్కాలంటే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అడుగుతున్నాడని పేర్కొన్నారు మంత్రి అంబటి.

మా కాపులకు దురద ఎక్కువ అని పవన్ కళ్యాణ్ అంటున్నారని పేర్కొన్నారు అంబటి.  పవన్ కళ్యాణ్ ను మా  పవన్ కళ్యాణ్ అంటున్న కాపులను చంద్రబాబుకు అమ్మేస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి. అయితే  పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటున్నారు.. అంతేకాదు ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ గొడ్డు చాకిరీ చేస్తున్నారని.. నిజానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రి కాలేడంటూ చంచలన కామెంట్స్ చేశారు మంత్రి అంబటి. పవన్ కళ్యాణ్ కాపులతో బాబు పల్లకిని  మోయిస్తాడంటూ కామెంట్ చేశారు.

అంతేకాదు జనసేన వీర మహిళలు అందరూ బాబు కాళ్లు పిసకాలని.. పవన్ కళ్యాణ్ సీఎం కాదుకదా.. కనీసం , మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా రాదని తెలిపారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ కొడుక్కి మంత్రి పదవి ఇవ్వని వాడు, పవన్ కళ్యాణ్ కి ఒక సంవత్సరం ముఖ్యమంత్రి ఎలా ఇస్తాడంటూ ప్రశ్నించారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నమ్మితే.. అతడిని గంగలో కలుపుతాడు.. కనుక కాపులందరూ తన మాట విని పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దని హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..