Migratory Birds: ఆ జిలాల్లో వలస పక్షుల సందడి.. ప్రసవం కోసం ఇంటికి వచ్చిన కూతుళ్లుగా పరిగణించే గ్రామస్థులు

|

Jan 07, 2023 | 4:09 PM

సాధారణంగా, సైబీరియా నుండి వలస పక్షులు సత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలంలోని వీరాపురం అనే చిన్న గ్రామానికి వస్తాయి. గ్రామస్తులు గుడ్లు పెట్టే పక్షులను "ప్రసవం కోసం ఇంటికి వచ్చిన" కూతుళ్లుగా పరిగణిస్తారు.

Migratory Birds: ఆ జిలాల్లో వలస పక్షుల సందడి.. ప్రసవం కోసం ఇంటికి వచ్చిన కూతుళ్లుగా పరిగణించే గ్రామస్థులు
Migratory Birds In Anantapu
Follow us on

సైబీరియన్ వలస పక్షుల సందడి అనంతపురంలో కనిపించింది. అనంతపురం శివారులోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పెద్ద సంఖ్యలో ఇవి ఆవాసం ఏర్పరుచుకున్నాయి. పెయింటెడ్ కొంగలు ఇంకా అనేక ఇతర జాతుల పక్షులు రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో తిష్ట వేశాయి. చెట్లతో నిండిన ఆవరణలో ఇవి వచ్చి చేరాయి. ప్రకృతి ప్రేమికులు వీటిని చూసి సంబరపడుతున్నారు.

సైబీరియా కొంగలు 6,000 కి.మీ దూరం నుండి ఈ ప్రాంతాలకు వలస వస్తాయి, సంతానోత్పత్తి కోసం చెట్లలో గూళ్లు కడతాయి. దగ్గర్లోని ట్యాంకులు లేదా ఇతర నీటి వనరులలో లభించే చేపలపై ఆధారపడతాయి. సాధారణంగా, సైబీరియా నుండి వలస పక్షులు సత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలంలోని వీరాపురం అనే చిన్న గ్రామానికి వస్తాయి. గ్రామస్తులు గుడ్లు పెట్టే పక్షులను “ప్రసవం కోసం ఇంటికి వచ్చిన” కూతుళ్లుగా పరిగణిస్తారు. అయితే అవి చేపల కోసం కర్ణాటక వైపు 40 కి.మీ దూరం ప్రయాణిస్తాయట. సాధారణంగా కొన్ని పక్షులు మాత్రమే ముందుగా వచ్చి ఆ ప్రాంతంలో భద్రతపై అధ్యయనం చేస్తాయని, ఆ తర్వాత పెద్ద సంఖ్యలో పక్షులు వలస వస్తాయని అయితే వీటికి వేటగాళ్ల ముప్పు ఎక్కువని అటవీ అధికారులు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..