MEIL: రెండు అంబులెన్సులు, డయాలసిస్ మిషన్ల అందజేత.. దాతృత్వం చాటుకున్న మేఘా డైరెక్టర్ సుధా రెడ్డి..

|

Oct 27, 2021 | 7:36 PM

ఎక్కడ అవసరం అయితే.. అక్కడ మేఘమై కరుణను వర్షిస్తోంది మేఘా ఇంజినీరింగ్ సంస్థ. తాజాగా ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకునేందుకు..

MEIL: రెండు అంబులెన్సులు, డయాలసిస్ మిషన్ల అందజేత.. దాతృత్వం చాటుకున్న మేఘా డైరెక్టర్ సుధా రెడ్డి..
Megha Engineering
Follow us on

ఎక్కడ అవసరం అయితే.. అక్కడ మేఘమై కరుణను వర్షిస్తోంది మేఘా ఇంజినీరింగ్ సంస్థ. కోవిడ్ సమయంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో క్రయోజినిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను అందించి ఆదుకుంది.  తాజాగా ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకునేందుకు అంబులెన్సులు అందించి దాతృత్వం చాటుకుంది. మంగ‌ళ‌గిరిలోని ఎన్ ఆర్ ఐ జనరల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రెండు అంబులెన్స్ లను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ ఎల్ ) సంస్థ బుధవారం అందచేసింది. ఎం ఈ ఐ ఎల్ సంస్థ డైరెక్టర్ పి. సుధారెడ్డి అంబులెన్సుల కీస్‌ను ఎన్ ఆర్ ఐ సంస్థ అధ్యక్షులు నరసరాజు, ప్రిన్సిపల్ లక్ష్మికి ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమం లో అందచేశారు.

ఈ సందర్భంగా పి. సుధారెడ్డి మాట్లాడుతూ మేఘా సంస్థ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావటంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. హైద‌రాబాద్ లోని నిమ్స్ లో కాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మించామని, పలు ఆసుపత్రులకు అవసరమైన అంబులెన్సులు, గ్రామాలకు కూడా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంబులెన్సులలో ఐసీయూకు అవసరమైన సౌకర్యం కల్పించినట్లు ఎంఈ ఐఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

అంబులెన్సు ను వివిధ ఆసుపత్రుల నుంచి ప్రాణాపాయంలో ఉన్న రోగులు, రోడ్ లేదా ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలిస్తామని ఎన్‌ఆర్‌ఐ జనరల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్, సి ఈ ఓ లు నరసరాజు, వెంకట ఫణిధర్ తెలిపారు. అంబులెన్సు లో పోర్టబుల్ వెంటిలేటర్, మానిటర్, డెఫ్యూబ్ లెటర్, ఇన్ఫ్యూజన్, ఆక్సీజెన్, సెక్షన్ మొదలైనవి ఉంటాయి. అంబులెన్సు ను ఆసుపత్రికి అందచేసే కార్యక్రమం లో ఎన్ ఆర్ ఐ అకాడమీ అఫ్ సైన్సెస్ కోశాధికారి టి సి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

డయాలసిస్ విభాగాన్ని ప్రారంభించిన..

మంగ‌ళ‌గిరిలోని ఎన్ ఆర్ ఐ జనరల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రెండు అంబులెన్స్‌లతోపాటు..  పామర్రులోని తమ్మారెడ్డి రెడ్డిస్ శృతి హాస్పిటల్స్‌లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ దాతృత్వంతో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ విభాగాన్ని ఎం ఈ ఐ ఎల్ సంస్థ డైరెక్టర్ పి. సుధారెడ్డి ప్రారంభించారు. శృతి హాస్పిటల్స్‌లో డయాలసిస్ విభాగం ఏర్పాటుకు 25 లక్షలు ఆర్థిక సహాయం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

సంస్థ డైరెక్టర్ పి. సుధారెడ్డి మాట్లాడుతూ.. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుస్తున్నట్లుగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..

Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..