Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చూస్తుండగానే 60 బోట్లు, చేపలు..

|

Nov 20, 2023 | 11:14 AM

Visakha Fishing Harbour Fire Accident: ఓ బోటులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. అవి కాస్త అలా వ్యాపించి 60 బోట్లు కాలిపోయాయి. కళ్లముందే లక్షలు విలువ చేసే సరుకు కాలిపోతున్నా చేసేది ఏమిలేక చూస్తుండిపోయారు అక్కడి వారు.. అర్థరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విశాఖతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చూస్తుండగానే 60 బోట్లు, చేపలు..
Visakha Fishing Harbour
Follow us on

Visakha Fishing Harbour Fire Accident: ఓ బోటులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. అవి కాస్త అలా వ్యాపించి 60 బోట్లు కాలిపోయాయి. కళ్లముందే లక్షలు విలువ చేసే సరుకు కాలిపోతున్నా చేసేది ఏమిలేక చూస్తుండిపోయారు అక్కడి వారు.. అర్థరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విశాఖతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సాధారణంగా హార్బర్‌లో మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి..అర్ధరాత్రి తర్వాత ఓ పడవలో నుంచి మంటలు చెలరేగాయి. అలా మెల్లిగా మంటలు మిగిలిన చోట్లకు అంటుకుని 60కుపైగా బోట్లకు అగ్నికి ఆహుతయ్యాయి.

ఈ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బోట్లలో లక్షల విలువ చేసే మత్స్య సంపద ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.. కళ్లముందే తమ జీవనాధారమైన బోట్లన్నీ మంటల్లో కాలిపోతుండడంతో కన్నీటి పర్యంతం అయ్యారు.

అయితే ప్రమాద సమయంలో బోటుల్లో ఎవరైనా ఉండిపోయారా అనేది తెలియలేదు.. మరోవైపు సముద్ర గాలులకు మంటలు మరింతగా రేగి పక్కనున్న బోట్లకు విస్తరించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మత్సకారుల్లో కొంతమంది ధైర్యంగా వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంత నష్టం తగ్గింది..ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..