డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..

మార్కాపురం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మీ, రాజమ్మ ఇద్దరూ స్నేహితులు.. అయితే రాజమ్మ తన అవసరాల నిమిత్తం ఆదిలక్ష్మి దగ్గర అప్పుగా కొన్ని డబ్బులు తీసుకుంది. కాలక్రమేణా అవి వడ్డీతో సహా రూ.50లక్షలకు చేరాయి. దీంతో ఆదిలక్ష్మి తన డబ్బు తిరిగివ్వాలని కోరింది. కానీ రాజమ్మ మాత్రం కాస్త కంత్రిగా ఆలోచించింది.. ఆదిలక్ష్మిని లేపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉండదని ఆలోచించింది.. డబ్బులు ఇస్తానని ఇంటికి రమ్మని పిలిచి గుట్టు చప్పుడు కాకుండా ఆదిలక్ష్మిని లేపేసి.. ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతి పెట్టింది.

డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..
Markapuram Murder

Edited By:

Updated on: Aug 27, 2026 | 9:42 PM

మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండల కేంద్రంలో మహిళ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఓ మహిళ మరో మహిళను అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి (32) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు జులై 21న పెద్దారవీడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మి మరో మహిళ గుమ్మ రాజమ్మకు అధిక వడ్డీకి 50 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

అర్ధవీడుకు చెందిన ఆదిలక్ష్మి తనతో స్నేహంగా ఉంటున్న గుమ్మ రాజమ్మ అనే మహిళకు వడ్డీకి డబ్బులు ఇచ్చేంది. ఈ క్రమంలో ఈ మొత్తం 50 లక్షలకు చేరింది. అయితే గత కొంతకాలంగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతుండటంతో తనకు ఇచ్చిన 50 లక్షల రూపాయలను తిరిగి ఇవ్వమని అదిలక్ష్మి గట్టిగా నిలదీసింది. దీంతో డబ్బులు ఇస్తాను రమ్మని ఆదిలక్ష్మిని ఇంటికి పిలిచింది రాజమ్మ. అది నిజమని ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లిన రాజమ్మ తిరిగి రాలేదు. దీంతో బంధువులు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు రాజమ్మ వ్యవహారంపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో అప్పు తిరిగి ఇవ్వమని అడగడంతోనే ఆదిలక్ష్మిని హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. తనను ఇంటికి పిలిపించుకొని హత్య చేసి, అనంతరం ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి, పక్కా ప్లాన్‌ ప్రకారం పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితురాలు ఇచ్చిన సమాచారంతో మహిళను పాతిపెట్టిన పొలం పరిసరాలను కంభం సీఐ మల్లికార్జున, అర్ధవీడు ఎస్సై నాంచారయ్య, పోలీసు సిబ్బంది పరిశీలించారు. నిందితురాలితో పాటు ఆమె కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం సాయంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us