
విజయవాడ, జూలై 30: కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌కు అరుదైన అవకాశం దక్కింది. పర్యాటక శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 జిలాల్లో 373 అభివృద్ధి చేయదగిన బీచ్‌లను గుర్తించింది. అందులో 8 బీచ్‌లను బ్లూ ప్లాగ్ బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించటం.. వాటిల్లో మంగినపూడి బీచ్ కూడా ఉండటంతో జిల్లా వాసులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన ఈ జాబితాలో రుషికొండ బీచ్ ఇప్పటికే ఉండగా తాజాగా మంగినిపూడి బీచ్ కూడా చేరింది.
ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఎకో లేబుల్. ఈ గుర్తింపు పొందటం అంత సులభం ఏమి కాదు…డెన్మార్క్ కు చెందిన F.E.E అనే సంస్థ ఈ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ ట్యాగ్ ఎంతో ప్రత్యేకమైనది. ఈ ట్యాగ్ లైన్ ఉన్న బీచ్ లకు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్యాగ్ ఇవ్వాలంటే ఆ సంస్థ చాల కఠినమైన పరీక్షలే పెడుతుంది 33 అంశాలను పరిశీలించిన తర్వాత వాటిలో పాస్ అయితే కానీ ఈ సర్టిఫికెట్ రాదు. పర్యావరణం, నీటి నాణ్యత ,నిర్వహణ, పరిశుభ్రత, భద్రతా..ఇలా రకరకాల అంశాలను పరిశీలించి అత్యంత పరిశుభ్రమైనదిగా పరిగణిస్తూ ఈ ఎకో ట్యాగ్ లైన్ అయినా బ్లూ ఫ్లాగ్ బీచ్ అనే లోగోని ఇస్తుంది.
పరిశుభ్రమైన బీచ్ ల లిస్ట్ లోకి చేరిన మంగినపూడి బీచ్ అభివృద్ధి పనులకు ఇప్పటికే 50 లక్షల రూపాయలు నిధులు కేంద్రం నుండి మంజూరయ్యాయి. త్వరలో మరింత సుందరంగా తయారుకానున్న ఈ బీచ్ లో వాటర్ స్పాట్స్ కూడా పారంభం కానుంది. ఇప్పటికే దీనికోసం టెండర్లు వేశారు అధికారులు. ఇక్కడ చారిత్రాత్మక మైన ఓడ రేవు కూడా ఉంది. అక్కట్టుకునే నీరు నల్లని రంగుతో వుండే మట్టి చక్కటి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి కానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..