AP Municipal Elections Results: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ..

AP Municipal Elections 2021 Results: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో..

AP Municipal Elections Results: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ..
Ap Municipal Elections
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 14, 2021 | 12:13 PM

AP Municipal Elections 2021 Results: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 1 నుండి 10 వార్డుల లెక్కింపు పూర్తి అయింది. విజేతలు వివరాలను అధికారులు ప్రకటించారు. అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం.. 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి పోతంశెట్టి ప్రసాద్ 232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ వార్డులో వైసీపీ అభ్యర్థి చిట్టూరి సతీష్ 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 3వ వార్డులో టీడీపీ అభ్యర్థి యారమాటి గంగరాజు 236 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఇక 4వ వార్డులో టీడీపీ అభ్యర్థి గుండు రామ తులసి 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

5వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎర్నేని ప్రభావతి 224 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 6వ వార్డులో టీడీపీ అభ్యర్థి కాశిన కాశీ విశ్వనాధం 17 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ 40 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 8వ వార్డు వైసీపీ అభ్యర్థి మందపల్లి రవి కుమార్ 192 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 9వ వార్డు టీడీపీ అభ్యర్థి చుండ్రు చిన సుబ్బారావు చౌదరి 11 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఇక 10వ వార్డు టీడీపీ అభ్యర్థి సిరంగుల జ్యోతి 70 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. గెలుపొందిన వారికి సాయంత్రంలోగా అధికారిక పత్రాలను అధికారులు అందజేయనున్నారు.

Also read:

Telangana AP MLC Elections 2021 Live : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్

AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా

కేటీఆర్‌ వర్సెస్‌ రామంచంద్రరావు.. ఒకరు గ్యాస్‌ సిలిండర్‌కు.. మరొకరు నిరుద్యోగికి మొక్కుబడులు.. ఓటర్లు మాత్రం..