Lance Naik Sai Teja: అమరజవాను సాయి తేజ్ కుటుంబానికి మంచు విష్ణు బాసట.. పిల్లల చదువు ఖర్చులను భరిస్తామంటూ..

|

Dec 09, 2021 | 6:19 PM

Army Chopper Crash: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య , వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందికూడా మృతి చెందారు. ఈ వ్యక్తిగత సిబ్బంది ..

Lance Naik Sai Teja: అమరజవాను సాయి తేజ్ కుటుంబానికి మంచు విష్ణు బాసట.. పిల్లల చదువు ఖర్చులను భరిస్తామంటూ..
Manchu Vishnu Sai Tej
Follow us on

Lance Naik Sai Teja: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య , వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందికూడా మృతి చెందారు. ఈ వ్యక్తిగత సిబ్బంది మృతులల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ ఒకరు. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ కూడా వీరమరణం పొందారు. దీంతో సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. సాయితేజ ఆకస్మిక మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిజేస్తున్నారు. సాయితేజ కుటుంబానికి అండగా నిలబడతామని అంటున్నారు.

ఈరోజు సాయి తేజ్ భార్య శ్యామలను మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ కుటుంబానికి తాము అండగా ఉంటామని మంచు విష్ణు చెప్పారు. అంతేకాదు.. సాయితేజ.. కొడుకు, కుమార్తెల చదువు మొత్తం తమ విద్యాసంస్థ విద్యానికేతన్  భరిస్తుందని ప్రకటించారు. సాయి తేజ్ పిల్లలు చదువు..  ఇంజనీరింగ్ వరకు తమ విద్యా సంస్థలోనే ఉచితంగా చదివిస్తామని చెప్పారు. ఇప్పటికే సాయి తేజ కుటుంబాన్ని విద్యనికేతాన్ సంస్థ ప్రతినిధులు కలిశారు. త్వరలో సాయితేజ కుటుంబాన్ని వారం, పదిరోజుల్లో నేరుగా వెళ్లి కలనున్నానని మంచు విష్ణు చెప్పారు.  సాయి తేజ్ ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

మరోవైపు సాయి తాజ్ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో సాయి తేజ్ అంత్య క్రియల కోసం గ్రామంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Also Read:  భారత్ గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది.. బిపిన్ రావత్ మృతికి సంతాపం తెలిపిన విదేశాలు ఇవే..