విజయనగరం ఏజెన్సీలో గజరాజుల బీభత్సం.. ఏనుగుల దాడిలో రైతు మృతి

విజయనగరం ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి.. ఏనుగుల దాడిలో ఓ రైతు ప్రాణాలను కోల్పోయారు.

  • Balaraju Goud
  • Publish Date - 9:50 am, Fri, 13 November 20
విజయనగరం ఏజెన్సీలో గజరాజుల బీభత్సం.. ఏనుగుల దాడిలో రైతు మృతి

#elephants attack:విజయనగరం ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి.. ఏనుగుల దాడిలో ఓ రైతు ప్రాణాలను కోల్పోయారు. కొమరాడ మండలం పరశురామ్‌పురంలో పొలం పనులకు వెళ్లిన లక్ష్మీ నాయుడు అనే రైతు పై ఏనుగులు దాడికి దిగాయి.. ఈ దాడిలో లక్ష్మినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.. ఏనుగులు నిన్న గురువారం అర్ధరాత్రి నుండి అడవుల నుంచి జనసంచార ప్రదేశాలకు వచ్చి రెచ్చిపోయాయి. గ్రామాల్లో ప్రవేశించిన ఏనుగులు పెద్ద పెట్టున ఘింకారాలు చేస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా హడలెత్తిస్తున్నాయి. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో అని స్థానికులు భయందోళన గురవుతున్నారు. ఇదే ప్రాంతంలో గడిచిన మూడేళ్లలో ఇప్పటివరకు ఏడుగురిని బలితీసుకున్నాయి ఏనుగులు.. ఏనుగుల తరలింపు సాధ్యం కాక అటవీశాఖ అధికారులు చేతులెత్తేయటంతో ఏజెన్సీ ప్రాంతావాసులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఏనుగుల సంచారంపై ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.