Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం.. బహిర్భూమికి రావద్దంటే కొట్టి చంపారు..

అతను గొర్రెల కాపరి.. ఎప్పటిలాగే భార్యతో కలిసి ఉదయాన్నే పశువుల మేపటానికి పొలం వెళ్లాడు. సాయంత్రం భార్య గెదేలను తోలుకొని ఇంటికి వెళ్లింది. మరి కొద్దీసేపట్లో గొర్రెలు మాత్రమే ఇంటికి వచ్చాయి. గొర్రెల కాపరి జాడ మాత్రం కనిపించలేదు. ఆయన జాడ వెతుక్కుంటు వెళ్లిన భార్యకు శవమై కనపించాడు. అసలేం జరిగిందంటే.. గుంటూరు సమీపంలోని గొర్లవారిపాలెంకు చెందిన శాఖమూరి రాంబాబు గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్య వెంకాయమ్మతో కలిసి పొలానికి గొర్రెలు, గేదెలు తోలుకొని వెళ్లాడు. దాదాపు ఇరవై ఎకరాలను కౌలుగా తీసుకొని అందులో పశువులు మేపుకుంటున్నాడు. సాయంత్ర వరకూ గేదెలు మేపిన వెంకాయమ్మ ముందగా వాటిని తోలుకుని ఇంటికి వెళ్లింది.

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం.. బహిర్భూమికి రావద్దంటే కొట్టి చంపారు..
Guntur

Edited By:

Updated on: Sep 22, 2023 | 12:11 AM

అతను గొర్రెల కాపరి.. ఎప్పటిలాగే భార్యతో కలిసి ఉదయాన్నే పశువుల మేపటానికి పొలం వెళ్లాడు. సాయంత్రం భార్య గెదేలను తోలుకొని ఇంటికి వెళ్లింది. మరి కొద్దీసేపట్లో గొర్రెలు మాత్రమే ఇంటికి వచ్చాయి. గొర్రెల కాపరి జాడ మాత్రం కనిపించలేదు. ఆయన జాడ వెతుక్కుంటు వెళ్లిన భార్యకు శవమై కనపించాడు. అసలేం జరిగిందంటే.. గుంటూరు సమీపంలోని గొర్లవారిపాలెంకు చెందిన శాఖమూరి రాంబాబు గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్య వెంకాయమ్మతో కలిసి పొలానికి గొర్రెలు, గేదెలు తోలుకొని వెళ్లాడు. దాదాపు ఇరవై ఎకరాలను కౌలుగా తీసుకొని అందులో పశువులు మేపుకుంటున్నాడు. సాయంత్ర వరకూ గేదెలు మేపిన వెంకాయమ్మ ముందగా వాటిని తోలుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత గంట సమయానికి గొర్రెలు మాత్రమే ఇల్లు చేరాయి. దీంతో అనుమానం వచ్చిన వెంకాయమ్మ పొలం వరకూ రాంబాబును వెతుక్కుంటూ వెళ్లింది. అయితే పొలం వద్ద రాంబాబు మ్రుతదేహం కనిపించింది. వంటిపై కర్రతో కొట్టిన గాయాలు కనిపించాయి. దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏం జరిగిందో తెలియదంటూ పోలీసులు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాంబాబు కౌలుకు తీసుకున్న పొలం సమీపంలోనే రాజీవ్ గ్రుహ కల్ప నివాస సముదాయం ఉంది. గ్రుహకల్పలో నివాసం ఉండే వెంకటేష్, హేమంత్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమదైన శైలిలో విచారణ జరపగా అసలు నిజాన్ని ఆ యువకులు బయటపెట్టారు. సాయంత్రం సమయంలో యువకులు బహిర్బూకి రాంబాబు పొలంలోకి వెళ్లారు. గొర్రెలు తోలుకుంటూ వస్తున్న రాంబాబుకు ఆ యువకులు కనిపించారు. దీంతో రాంబాబు వారిని తమ పొలంలోకి రావద్దంటూ వారించాడు. ఈ క్రమంలో వారికి రాంబాబుకి మధ్య ఘర్షణ జరిగింది. మొదట వారిపై రాంబాబు చేయి చేసుకున్నాడు. అనంతరం ఆ యువకులు రాంబాబు చేతిలో ఉన్న కర్ర తీసుకొని రాంబాబుపైనే దాడి చేశాడు. ఈ దాడిలో రాంబాబు అక్కడికక్కడే చనిపోయాడు. రాంబాబు చనిపోవడంతో అవాక్కైన యువకులు అక్కడ నుండి మెల్లగా జారుకున్నారు.

పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు కాల్ డేటాను విశ్లేషించి అసలు నిందితులను పట్టుకున్నారు. బహిర్భూమికి రావద్దన్నందుకు కొట్టి చంపటంపై స్తానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..