Andhra News: తూర్పు గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి

Andhra News: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి, బైక్‌ను ఢీకొట్టి తర్వాత విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

Andhra News: తూర్పు గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి
Andhra News

Updated on: Sep 23, 2025 | 11:14 PM

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి, బైక్‌ను ఢీకొట్టి తర్వాత విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు పెరవలి మండలం తీపర్రుకు రాగానే ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ రాడ్‌ విరిగిన అదుపుతప్పి ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆదే సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఒకని కూడా బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తి కంకిపాడుకు చెందిన సత్యనారాయణగా గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.