అనంతలో బ్లాస్ట్.. పేలుడు ధాటికి ముక్కలైన వ్యక్తి.. 30 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా..
పేలుడు ధాటికి 30 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. సంఘటన స్థలంలో మృతదేహం గుర్తుపట్టనంతగా పేలిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అనంతపురంలోని ఆర్టీవో ఆఫీసు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక వ్యక్తి ముక్కలు ముక్కలై దుర్మరణం చెందిన ఘటన కలకలం రేపింది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. స్ప్రే పెయింట్ కోసం కెమికల్ డబ్బా తెరిచిన వ్యక్తి.. ఆ డబ్బా పేలుడు ధాటికి 30 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. సంఘటన స్థలంలో మృతదేహం గుర్తుపట్టనంతగా పేలిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..