TTD Srivari Seva Scam: తిరుమల శ్రీవారి భక్తులకు పంగనామాలు! కొత్త తరహా మోసం వెలుగులోకి.. అసలేం జరిగిందంటే

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన 14 మంది భక్తులను ఓ కేటు గాడు బురిడీ కొట్టించాడు. అయితే అసలు సంగతి తెలియక ఆ 14 మంది భారీ మొత్తంలో సొమ్ము చెల్లించి, ఆ తర్వాత అసలు సంగతి తెలియడంతో లబోదిబో మంటూ టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పాపం.. శ్రీవారికి సేవ చేయాలని భావించిన వారందరినీ సదరు కేటుగాడు నిండాముంచేశాడు..

TTD Srivari Seva Scam: తిరుమల శ్రీవారి భక్తులకు పంగనామాలు! కొత్త తరహా మోసం వెలుగులోకి.. అసలేం జరిగిందంటే
TTD Srivari Seva Scam

Updated on: Feb 15, 2025 | 8:39 PM

తిరుపతి, ఫిబ్రవరి 15: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారన్న సంగతి తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకెన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మందిని బురిడీ కొట్టించాడు. హైదరాబాద్‌కు ఈ 14 మంది భక్తుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.800 చొప్పున వసూలు చేశాడు. వీరంతా శ్రీవారికి సేవ చేయాలని భావించి టికెట్లు బుక్ చేసుకునేందుకు యత్నించారు. అయితే అవి బుక్ కాలేదు. దీంతో కృష్ణారావు అనే వ్యక్తిని వారంతా ఆశ్రయించి టోకెన్లు కొనుగోలు చేశారు. వాటిని తీసుకుని ఆ 14 మంది తిరుమలకు చేరుకున్నారు.

తీరా అక్కడి వచ్చిన తర్వాత కానీ అసలు నిజం బోధపడలేదు. తిరుమలకు వచ్చిన తర్వాత అసలు శ్రీవారి సేవకు ఎలాంటి టోకెన్లు ఉండవి, అవి ఉచితమని తెలిసి అంతా నాలుక్కరచుకున్నాఉ. దీంతో శ్రీవారి సేవ తామంతా కృష్ణారావు అనే వ్యక్తి ఒక్కరు రూ.800 చొప్పున చెల్లించి, టోకెన్తు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు తెల్పడంతో.. వారు కృష్ణారావుపై కేసు నమోదు చేశారు. కృష్ణారావు శ్రీవారి సేవ టోకెన్లతోపాటు ఇతర దర్శన టికెట్లు కూడా భక్తులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణారావును గాలించే పనిలో పడ్డారు.

మరోవైపు తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 5 రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి తిరుపతిలోని సిట్‌ కార్యాలయానికి తరలించారు. ఫిబ్రవరి 18వ తేదీతో ఈ నలుగురి కస్టడీ ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.