అనంతపురం జిల్లా గుత్తి పట్టణములో ఆంధ్రా ప్రగతి గ్రామీణ ప్రగతి బ్యాంక్(APGPB) ఏటీఎంలో మునీంద్ర అనే మహిళ ఏటీఎం కార్డును ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తి 25వేల రూపాయల నగదును అపహరించాడు. మోసానికి గురి అయినటు వంటి మహిళ విషయం తెలుసుకొని గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏటీఎం కార్డు ఉపయోగించడం రానటు వంటి మహిళ డబ్బులు రావడం లేదని పక్కన ఉన్న వ్యక్తికి చూపించి డబ్బులు డ్రా చేసి ఇవ్వమని అడిగింది.
ఆ అపరిచితుడు రెండు మూడుసార్లు ఆమె ఏటీఎం కార్డును ఉపయోగించి ఇది పనిచేయడం లేదని చెబుతూ మాటల్లో పెట్టాడు. జాగ్రత్తగా తన దగ్గర ఉన్న మరో ఏటీఎం కార్డును తీసి ఆమెకి ఇచ్చాడు. ఆ యువకుడి ఆలోచన తెలియని ఆ మహిళ ఆ యువకుడు ఇచ్చిన ఏటీఎం కార్డుని తీసుకుని వెళ్ళిపోయింది.
ఆమె వెళ్లిపోయిన తర్వాత దుండగుడు ఏటీఎం కార్డుతో 25 వేల రూపాయలను డ్రా చేసుకొని పరార్ అయ్యాడు. బాధితురాలు గుత్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంలో మహిళను మోసం చేసి.. కార్డు మార్చి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..