Malapalli Novel: తొలి రాజకీయ నవల ‘మాలపల్లి’కి శత జయంతి సదస్సు… నవల తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయం. 

|

Dec 05, 2021 | 1:12 PM

Malapalli Novel: వందేళ్ల క్రితమే భారత దేశంలోని సాంఘీక, ఆర్థిక, ఆధ్యాత్మిక అసమానతలను చూపించిన పుస్తకమే మాలపల్లి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. గుంటూరులో..

Malapalli Novel: తొలి రాజకీయ నవల మాలపల్లికి శత జయంతి సదస్సు... నవల తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయం. 
Malapalli Novel
Follow us on

Malapalli Novel: వందేళ్ల క్రితమే భారత దేశంలోని సాంఘీక, ఆర్థిక, ఆధ్యాత్మిక అసమానతలను చూపించిన పుస్తకమే ‘మాలపల్లి’ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. గుంటూరులో మాలపల్లి శత జయంతి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ కవులు, రచయితలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. రామదాసు, సంగదాసు, వెంకట దాసు పాత్రల చిత్రీకరణ ద్వారా అనాటి సమాజ పరిస్థితులను కళ్ళకట్టినట్లు చూపించారన్నారు. సంగ దాసు గాంధీ సిద్దాంతాలకు ప్రతీకగా, వెంకట దాసు భగత్ సింగ్ ఆలోచనలకు ప్రతీకగా ఈ నవలలో కనిపిస్తారన్నారు. దళిత సమస్య పరిష్కారాన్ని నవలో ఉన్నవ లక్ష్మినారాయణ చూపించారన్నారు. తెలుగు సాహిత్యంలో మహా ప్రస్థానం, గబ్బిలం, మాలపల్లి పుస్తకాలు మత గ్రంధాలవంటివన్నారు. జీవన ప్రవాహంలో కొత్త పోకడలు, ధోరణలు వస్తుంటాయని వాటిన్నింటిని కొన్ని పుస్తకాలు ప్రతిబింబిస్తుంటాయని కవి శివారెడ్డి అన్నారు.

తెలుగు సాహిత్యంలోనే మాలపల్లి మణిహారం వంటిదని, ప్రపంచ సాహిత్యంతో పోల్చదగినదని అన్నారు. గాంధీజీ జాతీయోద్యమ రాజకీయాల్లోకి రావడానికి ముందే ఉన్నవ ఈ పుస్తకాన్ని రచించారని కే శ్రీనావాస్ అన్నారు. భాయతీయ వాస్తవ పరిస్థితులను అక్షర బద్దం చేసిన మాలపల్లి నవలను మరింతగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆజాదీ అమృతోత్సవ్ లో భాగంగా ఇటువంటి సదస్సులను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు.

ఉన్నవ లక్ష్మినారాయణ నాటి సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించాలని.. సమసమాజాన్ని స్థాపించాలనేయ్ లక్ష్యంతో పనిచేశారు. కుల వ్యవస్థని నిరసిస్తూ.. అగ్రవర్ణాలు, హరిజనులు కలిసి మెలసి ఉండాలని భావించారు. ఉన్నవ 1922లో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి రాయవెల్లురు జైలుకు వెళ్లారు. అక్కడే తన లక్ష్య సాధనకై విప్లవాత్మకమైన ‘మాలపల్లి’ నవలను రచించారు. ఆ నవల ఇప్పుడు శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటుంది. ఈ మాలపల్లి నవల దళిత కుటుంబాన్ని ప్రధాన కథాశంగా రచించిన తొలి రాజకీయ నవల.

తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా కీర్తిగాంచారు ఉన్నవ లక్ష్మీనారాయణ. అంతేకాదు మాలపల్లి నవల తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయం.

reporter: Nagaraju, Guntur, TV9

Also Read:  తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..