మళ్లీ పెరిగిన చలి తీవ్రత.. సింగిల్‌ డిజిట్‌కి పడిపోయిన ఉష్ణోగ్రతలు!

గత వారం మోస్తరుగా ఉన్న చలి.. గత రెండు మూడు రోజులుగా మళ్లీ పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో దట్టమైన మంచు అలముకుని కనిపించింది. దీంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..

మళ్లీ పెరిగిన చలి తీవ్రత.. సింగిల్‌ డిజిట్‌కి పడిపోయిన ఉష్ణోగ్రతలు!
Alluri District Agency

Updated on: Jan 20, 2025 | 8:18 AM

అల్లూరి, జనవరి 20: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్ధరాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో చలిగాలులు విజృంభించాయి. ముఖ్యంగా ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారునంగా పడిపోయాయి. ఏజెన్సీ మొత్తం దట్టమైన పొగమంచు కప్పేసింది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుని కనిపించింది.

అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తరువాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. అరకులోయలో ఆదివారం 5.9 డిగ్రీల మేర అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక చలితీవ్రత వల్ల మన్యంలోని స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకూ మంచు అధికంగా కురవడంతో రోడ్లపై వాహన దారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఇక తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి చలి గాలులు వీయడం ప్రారంభించాయి. దీంతో వృద్దులు, చిన్నారులు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.

సాధారణంగా సంక్రాంతి సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతుంటాయి. ఈ ఏడాది కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోవటంతో చలితీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అటు తెలంగాణలోనూ చాలా ప్రాంతాల్లో 12 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.