Rain Alert: తరుముకొస్తున్న పెను తుఫాను.. 3 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు

|

Nov 25, 2024 | 6:17 AM

రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది..

Rain Alert: తరుముకొస్తున్న పెను తుఫాను.. 3 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
Rain Alert
Follow us on

విశాఖపట్నం, నవంబర్‌ 25: ఏపీని వానలు ఇప్పట్లో వదిలేలా లేవు. చలికాలం ప్రారంభమైనా వానల జోరు తగ్గడం లేదు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఆదివారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ నుంచి వాయవ్య దిశగా కదులుతుంది. క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తుపాను సంభవించే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలుతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం రైతులు, జన సామాన్యాన్ని అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతూ బుధవారం (నవంబర్‌ 27) సాయంత్రానికి తమిళనాడు నుంచి శ్రీలంక తీరాలు వైపు వెళ్లనుంది. అక్కడ శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించారు. ఇక వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుంచి వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెల్పింది. వాయు గుండం ప్రభావంతో నవంబర్‌ 27నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కరిసే ఛాన్స్‌ ఉన్నట్లు సూచించింది. అటు రాయలసీమ జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారినట్లు పేర్కొంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. అందువల్ల మంగళవారం నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, ఈ నెల 29వ తేదీ వరకూ మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు విజృభిస్తున్నాయి. ఇప్పటికే ఉదయం పూట చలి తీవ్రత అధికంగా ఉంటుంది. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అటు తెలంగానలోనూ చలి రోజురోజుకీ పెరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.