AP Weather Alert: యవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. కాగా, ఈ అల్పపీడనం ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, నాలుగైదు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి..
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పోటెత్తుతోంది. వరద తాకిడి భారీగా ఉండటంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచంలం వద్ద గోదావరి నది నీటిమట్టం 26.50 అడుగలకు పెరిగింది. వదర ప్రవాహం కొనసాగుతుండటంతో.. ఇవాళ సాయంత్రానికి 43 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక గోదావరి నది ఉధృతి పోలవరం ప్రాజక్టు వద్ద ఎక్కువగా ఉంది. దాంతో అలర్ట్ అయిన అధికారులు.. స్పిల్‌వేకు ఏర్పాటు చేసిన 46 గేట్లను ఎత్తివేసి రాజమండ్రి వైపు 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1,64,897 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల వరకు గోదావరికి వరద ప్రవాహం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీశైలం జలాశాయానికి పెరుగుతున్న వరద..
కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక నుంచి జూరాలకు భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో.. నీటిని కిందకు వదిలారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1,92,035 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. డ్యామ్ గరిష్ట నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 77.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగుల కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 849 అడుగల మేరకు ఉంది.
Also read:
TS Eamcet Hall Tickets: టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Guru Purnima 2021: గురు పూర్ణిమ శుభ ముహుర్తము.. ప్రాముఖ్యత.. ఈరోజున ఏం చేయాలంటే..