AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు

|

Dec 22, 2022 | 6:20 PM

ఏపీలో ఈ నెల 24 నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు
Andhra Pradesh Weather Report
Follow us on

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. నైరుతి & ప్రక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర అల్ప పీడన ప్రాంతం ఉత్తర వాయువ్య దిశగా కదిలి, గురువారం ఉదయం వాయుగుండంగా మారింది. నైరుతికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతానికి సమీపంలో  శ్రీలంకకి తూర్పు ఈశాన్యంగా 420 కిమీ దూరంలో, నాగపట్టణం (తమిళనాడు) కి దక్షిణ ఆగ్నేయ దిశగా 600 కిమీ, చెన్నై (తమిళనాడు)కి ఆగ్నేయంగా 690 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తదుపరి 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా వంపు తిరిగి శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఏపీపై దీని ప్రభావం నామమాత్రంగానే ఉండనుంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు రాష్ట్రం మీదుగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో పొగమంచు కొనసాగనుంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

గురు, శుక్ర, శనివారాల్లో  :-  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

గురువారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

శుక్ర, శనివారాల్లో  :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-

గురు, శుక్రవారాల్లో :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.