AP Weather: తీవ్రరూపును సంతరించుకోనున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వానలు దంచుడే

|

Nov 25, 2024 | 1:34 PM

వాయుగుండం... రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత వచ్చే 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ వెదర్ రిపోర్ట్ మీ కోసం....

AP Weather: తీవ్రరూపును సంతరించుకోనున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వానలు దంచుడే
Andhra Weather Report
Follow us on

తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మద్య బంగాళాఖాతం పై నున్న అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నవంబర్ 25 వ తేదీ 2024 ఉదయము 0830 గంటలకు తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతములో 5.0° ఉత్తర అక్షాంశం, 85.3° తూర్పు రేఖాంశం వద్ద వాయిగుండముగా కేంద్రీకృతమై ఉంది  ట్రింకోమలీకి ఆగ్నేయంగా 600 కి.మీ.,నాగపట్నంకు ఆగ్నేయంగా 880 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కి.మీ… చెన్నైకి ఆగ్నేయంగా 1050 కి.మీ దూరములో ఉన్నది. ఇది వచ్చే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. అంతేగాక ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

సోమవారం, మంగళవారం :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది .

బుధవారం;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ :-

సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

బుధవారం;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..