తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల నోట్లకు మోక్షం లభించింది. రూ.2 వేల నోట్ల మార్పిడిలో ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవసప్థానం ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది.
2023 అక్టోబర్ 7 నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి రద్దు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఆ తరువాత కూడా భక్తులు తిరుమల శ్రీవారి హుండీలో రూ. 2 వేల నోట్లను కానుకగా సమర్పించారు. ఆ నోట్లు తీసుకునేందుకు బ్యాంకులు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ అధికార్లతో సంప్రదించి నోట్ల మార్పిడికి విజ్ఞప్తి చేసింది టీటీడీ. ఏడాది పైగా ఆర్బీఐ అధికారులను ఒప్పించిన టీటీడీ అధికారులు రూ.2 వేల నోట్లను తీసుకునేలా చేసింది.
2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే..! అయితే.. కొందరు భక్తులు ఆ తరువాత కూడా తిరుమల శ్రీవారికి హుండీలో వాటిని సమర్పించారు. దీంతో ఆ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలంటూ టీటీడీ అధికారులు పలుమార్లు ఆర్‌బీఐని కోరారు. ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు నోట్లును తీసుకునేందుకు అంగీకరించారు. 2023 అక్టోబర్ 8 నుండి 2024 మార్చి 22 వరకు 5 విడతలో 3 కోట్ల 20 లక్షల విలువ చేసే 2 వేల నోట్లను మార్పిడి చేసుకుంది టీటీడీ.
ఇదిలావుంటే, 2016లో జరిగిన నోట్ల రద్దు సమయంలో టీటీడీ హుండీ ద్వారా వచ్చిన సుమారు రూ.50 కోట్ల నోట్లను రిజర్వు బ్యాంక్ తీసుకోలేదు. దీనిపై టీటీడీ పాలక మండలి కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…