Srikakulam: బలగ భద్రమ్మ గుడిపై పడిన పిడుగు.. దెబ్బతిన్న దేవతా విగ్రహాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్ల కింద వెళ్లవద్దని సూచించింది.

Bhadramma Temple
శ్రీకాకుళం పట్టణం బలగలో భద్రమ్మగుడిపై పిడుగు పడింది. దీంతో ఆలయ గోపురం, పైన ఉన్న దేవతా విగ్రహాలు దెబ్బతిన్నాయి. ఆలయం గోడలు కూడా బీటలు వారడంతో ఆందోళన నెలకొంది. ఆ టైమ్‌లో భక్తులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగులతో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బలగలోని ఉన్న భద్రమ్మగుడిపై పిడుగు పడడంతో గర్భగుడి గోడలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాద అనంతరం టెంపుల్‌ను పరిశీలించిన ఆలయ కమిటీ మరమ్మతుల విషయంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
