AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండనుంది.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఎలా ఉండనుంది.? వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఎలా ఉన్నాయో.! అటు చలి.! ఇటు మంచు.. ఆంధ్రప్రదేశ్‌ అంతటా విచిత్ర వాతావరణం ఉంది. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.. ఆ వివరాలు

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండనుంది.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Andhra Weather

Updated on: Jan 07, 2025 | 1:53 PM

అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. లాంటివి ఏవి లేవు. మొన్నటివరకు వర్షాలతో ఏపీ సతమతం కాగా.. ఇప్పుడు కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు తప్పితే.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఐదు రోజులు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా..

—————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
—————————————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:-
————–

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి