AP Rains: అబ్బబ్బ.! ఎంత చల్లటి వార్త.. ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు..

|

May 13, 2024 | 1:45 PM

దక్షిణ అంతర్గత కర్ణాటక & పొరుగు ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు మధ్య మహారాష్ట్ర మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించింది.

AP Rains: అబ్బబ్బ.! ఎంత చల్లటి వార్త.. ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు..
Rain Alert
Follow us on

దక్షిణ అంతర్గత కర్ణాటక & పొరుగు ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు మధ్య మహారాష్ట్ర మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించింది. నైరుతి రుతుపవనాలు 19 మే, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు మరియు నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————
ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి :-

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .

రాయలసీమ :-
——————-

ఈరోజు ,రేపు, ఎల్లుండి :-