Andhra Pradesh: రాజమండ్రిలో చిరుత కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు..

|

Sep 07, 2024 | 9:48 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత కలకలం సృష్టించింది. నగర శివారులో చిరుత పులి సంచారంతో జనం హడలిపోయారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఒక కార్యాలయం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. చిరుత పులి అడుగుజాడలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

Andhra Pradesh: రాజమండ్రిలో చిరుత కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు..
Leopard
Follow us on

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత కలకలం సృష్టించింది. నగర శివారులో చిరుత పులి సంచారంతో జనం హడలిపోయారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఒక కార్యాలయం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. చిరుత పులి అడుగుజాడలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

పులి సంచరించినట్టు సీసీ కెమెరా దృశ్యాలతో నిర్ధారణకు రావడంతో స్థానిక ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అధికారులు. చిరుత తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక పంచాయతీ అధికారులు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చిరుత సంచారంపై రాజానగరం ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ. దివాన్ చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరామ్‌పురం అటవీప్రాంతం వైపు చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు ఎమ్మెల్యే బత్తుల.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..