Andhra Pradesh: చిట్వేల్‌లో చిరుత కలకలం.. మేకల మందపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు..

| Edited By: Jyothi Gadda

Oct 11, 2024 | 6:09 PM

అటవీ ప్రాంతానికి పక్కనే ఉన్న గ్రామంలోకి ఒక్కసారిగా పులిరావడం అది మేకను చంపడంతో గ్రామస్తులు భయం భయంగా గడుపుతున్నారు ... మళ్లీ ఎక్కడ గ్రామంలోకి ఎప్పుడు వస్తుందో, ఎవరిని ఏం చేస్తుందోనని భయంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నల్లమల ఫారెస్ట్ కు పరివాహక ప్రాంతంలో తరచూ వస్తున్న చిరుతలు ఇప్పుడు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 

Andhra Pradesh: చిట్వేల్‌లో చిరుత కలకలం.. మేకల మందపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు..
Leopard
Follow us on

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలోని చెర్లోపల్లిలో చిరుత కలకలం ఇప్పుడు అందర్నీ అక్కడ భయభ్రాంతులకు గురిచేస్తుంది. చెర్లోపల్లి గ్రామంలోని గొర్ల సుబ్బరాయుడు అనే వ్యక్తికి చెందిన మేకల దొడ్డిలోకి దూరి అందులో ఉన్న మేకపై దాడి  చేసింది. మేక మెడ,  పొట్ట వద్ద పులి గాయపరిచింది. దాంతో ఆ మేక అక్కడికక్కడే చనిపోయింది. దీంతో  గ్రామస్తులు చిరుత దాడిగా భావించి భయాందోళనకు గురవుతున్నారు. అటవీ పరివాహక ప్రాంతానికి పక్కనే ఉన్నప్పటికీ తమ గ్రామంలో ఎప్పుడు ఇలా జరగలేదని చిరుతలు సంచరిస్తున్నాయని దశాబ్దాలుగా చెబుతున్నారే తప్ప, ఏనాడు మా గ్రామంలోకి చిరుత వచ్చిన ఆనవాళ్లు లేవని చెబుతున్నారు. కానీ , ఇప్పుడు చిరుత వచ్చి ఇలా మేకల మందపై దాడి చేయటంతో  గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మేకను కాబట్టి సరిపోయిందని, అదే ఏ మనిషి మీద పడి గాయపరిస్తే పరిస్థితి ఏంటని గ్రామస్తులు వాపోతున్నారు.

అయితే ఈ విషయాన్ని గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామానికి వచ్చిన అధికారులు అది చిరుతపులేనా లేక మరేదైనా జంతువు వచ్చిందా అనేదానిపై ఆరా తీశారు. అక్కడ గుర్తించిన పాద ముద్రలను సేకరించారు.  అవి చిరుత పులికి సంబంధించినవేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత గ్రామస్తులకు వారు తగు సూచనలను తెలిపారు.

ఇవి చిరుత పులి అడుగులేనని గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలపడంతో గ్రామస్తులు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా, గ్రామంలో, గ్రామం చుట్టుపక్కల  ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రావొద్దని చెబుతున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఒంటరిగా ఎవరు గ్రామంలో సంచరించవద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. త్వరితగతిన చర్యలు చేపట్టి ఆ చిరుతను పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు ధైర్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

అటవీశాఖ అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని, వీలైనంత త్వరగా  ఆ చిరుత బారి నుంచి తమను  కాపాడాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఏది ఏమైనా, అవి చిరుత పాదముద్రలు అని నిర్ధారణ కావటంతో గ్రామస్తులు అందరూ కూడా తగు చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..