Lemon Prices: రుచిలోనే కాదు, ధరలోనూ పులుపే.. రోజురోజుకు పెరిగిపోతున్న రేట్లు.. సామాన్యుల జేబుకు చిల్లు

|

Apr 03, 2022 | 7:09 AM

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలూ(Essencial needs Prices) క్రమంగా చుక్కల్ని తాకుతున్నాయి. ఇప్పటికే అన్ని వస్తువుల ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్న ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్. ధరలు..

Lemon Prices: రుచిలోనే కాదు, ధరలోనూ పులుపే.. రోజురోజుకు పెరిగిపోతున్న రేట్లు.. సామాన్యుల జేబుకు చిల్లు
Follow us on

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలూ(Essencial needs Prices) క్రమంగా చుక్కల్ని తాకుతున్నాయి. ఇప్పటికే అన్ని వస్తువుల ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్న ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్. ధరలు పెరుగుతున్న వాటి సరసన ఇప్పుడు నిమ్మకాయలూ(Lemons) చేరాయి. కిలో ఏకంగా రూ.200 పెరిగింది. దీంతో వీటిని వాడాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. వేసవిలో విరివిగా వినియోగించే నిమ్మ ధరలు కొండెక్కాయి. ఎండల కారణంగా ఆశించినంత దిగుబడి రాకపోవడం, మార్కెట్ లో కొరత ఏర్పడటం వంటి కారణాలతో నిమ్మ రేట్లు పెరిగిపోతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌(Rajkot) లో కిలో నిమ్మ ధర ఏకంగా రూ.200 పలుకుతోంది. గత సీజన్‌లో రూ.50-60లుగా ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా రూ.200ల మార్కును తాకడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెలలో మొదటి రకం నిమ్మ కిలో ధర రూ.60 నుంచి ఏకంగా 90-100కి పెరిగింది. రెండో రకమైతే 80 నుంచి 90 వరకు పలికింది. జిల్లాలో కొన్ని చోట్ల ఒక్కో నిమ్మకాయను రూ.5 నుంచి 7లకు విక్రయిస్తున్నారు.

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రజలు తమ డైట్‌లో నిమ్మకాయల్ని విరివిగా వాడుతుంటారు. దీంట్లో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉండటంతో పాటు జీర్ణక్రియ సరిగా పనిచేసేలా, శరీరాన్ని హైడ్రేటడ్‌గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. దీంతో పెరిగిన వినియోగం పెరగడం, సరఫరాలో కొరత కారణంగా నిమ్మ ధరలు క్రమంగా ఆకాశాన్నంటుతున్నాయి. నిమ్మ ధరలు పెరగడం వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతోందని ఓ వినియోదారుడు వాపోయారు. ఈ ధరలు ఎప్పుడు దిగివస్తాయో తెలియడంలేదని వ్యాఖ్యానించారు.

Also Read

Beauty Care: పచ్చి పాలతో తళుక్కుమనే అందం మీ సొంతం.. ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి..

Raj Thackeray: మహారాష్ట్రలో కుల రాజకీయాలకు శరద్ పవార్ బాధ్యుడు.. రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు!

Amaravati: ఐదేళ్ల వరకు రాజధాని నిర్మాణం సాధ్యం కాదు.. హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఏపీ సర్కార్!