పట్నం.. పల్లె బాట పట్టింది.. ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి నెలకొంది.. మూడు రోజుల పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది.. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహిచేందుకు అందరూ సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం కీలక ప్రకటన విడుదల చేసింది..
ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య – తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..