ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణరాజు వేసిన పిటిషన్ పై సోమవారం సీబీఐ కోర్టులో ఎంక్వైరీ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే జగన్ కు, సీబీఐకు కోర్టు సూచించింది. అయితే మే 7 న జరిగిన విచారణలో అందుకు గడువు కోరిన జగన్.. తాజాగా మరోసారి కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలకు కోర్టు చివరి ఛాన్స్ ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన రఘు రామ కృష్ణరాజు విజయం సాధించారు. అయితే గత ఏడాది ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ అధిష్ఠానం ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కూడ వైసీపీ ఫిర్యాదు చేసింది. కాగా అప్పట్నుంచి వైసీపీపై డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు రఘు రామ కృష్ణరాజు. టీవీల్లో పలు కార్యక్రమాల్లో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఏకంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు.
Also Read: ఏపీలో కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. మరికొన్ని కీలక నిర్ణయాలు