Andhra Pradesh: పొలంలో పని చేస్తుండగా కనిపించిన ఊహించని దృశ్యం.. భయంతో రైతులు పరుగో పరుగు..

|

Oct 04, 2022 | 1:24 PM

కొందరు రైతులు పొలంలో పని చేస్తున్నారు. వారు నీరు పెట్టేందుకు వెళ్లగా ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది అంతే! దెబ్బకు అందరూ పరుగో పరుగు..

Andhra Pradesh: పొలంలో పని చేస్తుండగా కనిపించిన ఊహించని దృశ్యం.. భయంతో రైతులు పరుగో పరుగు..
Representative Image
Follow us on

రోజూలాగే పొలం పనులు చేస్తున్నారు కొందరు రైతులు. ఇక కాసేపటి తర్వాత పొలానికి నీరు పెట్టేందుకు పంపుసెట్టు దగ్గరకు వెళ్లారు. అంతే! అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. భయంతో పరుగులు పెట్టారు. ఇంతకీ అక్కడేం జరిగిందంటారా.? ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల కాలంలో సంభవించిన భారీ వర్షాలు, వరదలతో అడవుల్లో ఉండాల్సిన పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం వెతుక్కునే క్రమంలో ఇలా జనాల మధ్యకు వస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ఓ భారీ కొండచిలువ కనిపించింది. దీంతో వారంతా ఒక్కసారిగా భయంతో అక్కడునుంచి పరుగులు పెట్టారు. అనంతరం స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే అతడు స్పాట్‌కు చేరుకున్నాడు. ఎంతో చాకచక్యంగా ఆ పెద్ద కొండచిలువను బంధించాడు. ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టాడు. దాంతో రైతులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..