YS Sharmila Congress: కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరికపై కేవీపీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ ఆత్మీయులు కేవీపీ. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై తాజాగా కేవీపీ రామచంద్రరావు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ ఆత్మీయులు కేవీపీ. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై తాజాగా కేవీపీ రామచంద్రరావు సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే ఆమెకు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు కేవీపీ. కాంగ్రెస్ వాదిగా, వైఎస్ బిడ్డగా ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు కేవీపీ. గన్నవరం చేరుకున్న రాహుల్ గాంధీతో కేవీపీ, గిడుగు రుద్రరాజు భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు.
ఈ సందర్భంగా వైసీపీ, బీజేపీ సంబంధలు, తదుపరి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సహా, వైఎస్ షర్మిల అంశంపైనా వారు చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. షర్మిల చేరిక సహా ఇతర రాజకీయ అంశాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ సూచనలను అమలు చేస్తామని చెప్పారు కేవీపీ. 2018లో తెలంగాణలో టీడీపీ పొత్తుతో నష్టపోయామన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేవీపీ.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..