Twin Leopard: కర్నూలు జిల్లాలో జంట చిరుతలు.. భయాందోళనలో ప్రజలు

|

Jul 30, 2021 | 9:41 AM

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ చోట చిరుత పులి సంచారం..

Twin Leopard: కర్నూలు జిల్లాలో జంట చిరుతలు.. భయాందోళనలో ప్రజలు
Leopard
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ చోట చిరుత పులి సంచారం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంత కాలం ఒక చిరుత పులి సంచరిస్తుండగా మాత్రమే చూశాం. కానీ కర్నూలు జిల్లాలో తాజాగా జంట చిరుతలు తిరుగుతుండటంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళకు గురవుతున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. కోటకల్‌ గ్రామ శివారుల కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీపో ప్రాంతాల్లో ఉన్న గొర్రెల కాపరులకు రెండు చిరుతలు కనిపించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అటవి శాఖ అధికారులకు అందించారు.

అయితే తాజాగా కర్నూలు జిల్లాలో చిరుతపులులు సంచారం కలకలం రేపింది. ఎమ్మిగనూరు మండల సమీపంలో చిరుత పులులు రెండు కనిపించాయి. కోటకల్‌ గ్రామ శివారుల కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తు కనిపించాయి. గొర్రెలు కాసేందుకు వెళ్లిన ఓ గొర్రెల కాపరికి కోటకల్ కొండల్లో ఈ రెండు చిరుతలు కనిపించాయి.

వీటని తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. ఈ విషయన్ని సమీపంలోని గ్రామస్థులతోపాటు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. చిరుతపులి సంచారంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..

Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..