Watch Video: టోల్ ఫీజు అడిగినందుకు దారుణం.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే.. వైరల్ వీడియో..
కర్నూలు జిల్లా డోన్ అమకతాడు టోల్‌గేట్ సిబ్బందికి ఓ లారీ డ్రైవర్(Truck Driver) చుక్కలు చూపించాడు. టోల్ ఫీజు కట్టేదే లే అంటూ తెగేసి చెప్పాడు. అంతటితో ఆగలేదు.. సిబ్బంది..
కర్నూలు జిల్లా డోన్ అమకతాడు టోల్‌గేట్ సిబ్బందికి ఓ లారీ డ్రైవర్(Truck Driver) చుక్కలు చూపించాడు. టోల్ ఫీజు కట్టేదే లే అంటూ తెగేసి చెప్పాడు. అంతటితో ఆగలేదు.. సిబ్బంది ప్రశ్నిస్తుండగానే స్టీరింగ్ చేతబట్టి ఎక్స్‌లేటర్ తొక్కి ముందుకెళ్లాడు. డ్రైవర్ టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకెళ్లే క్రమంలో సిబ్బంది లారీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. డ్రైవర్ వినకపోవడంతో లారీ ముందున్న బంపర్‌పై ఒకరు నిలబడ్డారు. అయినా డ్రైవర్ లెక్కచేయలేదు. అదే స్పీడ్‌తో వెళ్లిపోయాడు. ప్రమాదకరమైన రీతిలో నిలబడి ఉన్నాడు సిబ్బంది. డ్రైవర్‌ను లారీ ఆపమని ఎంతలా వేడుకున్నా పట్టించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సిబ్బంది చిత్తశుద్దిని శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.
అమకతాడు టోల్ గేట్ వద్ద హరియాణా లారీని ఆపమని గుత్తి టోల్ గేట్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. లారీని ఆపేందుకు అమకతాడు టోల్ ప్లాజా ఉద్యోగి శ్రీనివాసులు యత్నించాడు. శ్రీనివాసులు లారీ ముందు భాగంపై ఎక్కినా డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే 10 కిలోమీటర్లు పోనిచ్చాడు. వెల్దుర్తి దగ్గర పోలీసులు లారీని ఆపి శ్రీనివాసులును కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఆలయంలో సమీపంలో చెలరేగిన మంటలు.. 11 మంది భక్తులు సజీవదహనం
TRS Plenary: గులాబీ మయమైన హైదరాబాద్.. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్వాగత ఉపన్యాసం