Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

వేద పండితులుగా స్థిరపడాలనుకున్నారు. ఆధ్యాత్మికులకు సేవ చేయాలనుకున్నారు. అయితే ఆ చిన్నారుల కల... కలగానే మిగిలిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. మంత్రాలయం వేద పాఠశాల కు చెందిన నలుగురు వేద విద్యార్థులతో సహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు.

Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
Road Accident

Edited By: Basha Shek

Updated on: Jan 22, 2025 | 10:38 AM

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు డ్రైవర్ కూడా మృత్యువు వారిన పడ్డాడు. వీరు ప్రయాణిస్తున్న కారు కర్ణాటక లోని రాయచూరు జిల్లా సిందనూరు సమీపంలో టైరు పేలి పల్టీలు కొట్టింది. దీంతో సుజయింద్ర, అభిలాష, హైవదన, డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నాటక లోని కొప్పళ జిల్లా ఆనేగొంది శ్రీ రఘనందనతీర్థ ఆరాధనోత్సవాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆరాధన ఉండడంతో రాత్రి మంత్రాలయం నుంచి తుఫాన్ వాహనం లో డ్రైవర్ తో 11 మంది బయలుదేరారు. కర్ణాటక లోని రాయచూరు జిల్లా సిందనూరు సమీపంలో తుఫాన్ వాహనం టైరు పేలి రొడ్డు పై పల్టీలు కొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతులంతా మంత్రాలయం కు చెందిన వారిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

కాగా కర్ణాటకలోనే మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలుకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై కూరగాయల లోడుతో వెళుతోన్న లారీ బోల్తా పడింది. దీంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సావనూర్ నుంచి యల్లాపూర్ వెళుతుండగా ట్రక్కు 50 మీటర్ల లోయలో పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో గాయపడిన 10 మందిని సమీపంలోని హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరో ప్రమాదంలో 10 మంది స్పాట్ డెడ్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి