Mantralayam : మంత్రాలయంలో సెక్కూరిటీ సిబ్బంది ఓవరేక్షన్, భక్తుడిని చితకబాదిన..

|

Jul 24, 2021 | 12:59 PM

కర్నూలు జిల్లా మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. ఒక భక్తుడ్ని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. దేవుడి దర్శన..

Mantralayam : మంత్రాలయంలో సెక్కూరిటీ సిబ్బంది ఓవరేక్షన్, భక్తుడిని చితకబాదిన..
Mantralayam
Follow us on

Mantralayam Temple security : కర్నూలు జిల్లా మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. ఒక భక్తుడ్ని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. దేవుడి దర్శన విధానంలో గుడిలో జరుగుతోన్న అక్రమాలపై ప్రశ్నించినందుకు దాడి చేశారు సెక్యూరిటీ సిబ్బంది. ‘కొట్టద్దు.. కొట్టద్దు..’ అని ప్రాధేయపడినా సెక్యూరిటీ సిబ్బంది భక్తుడ్ని వదలలేదు. కర్రలు, పైపు, ప్లాస్టిక్ లాఠీతో భక్తునిపై ఐదు, ఆరు మంది సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు.

దేవాలయ సెక్కూరిటీ సిబ్బంది కొట్టిన గాయాలకు బాధతో బాధిత భక్తుడు అరుపులు అరిచినా సెక్యూరిటీ సిబ్బంది ఏమాత్రం కనికరం చూపకపోగా, కోపంతో ఊగిపోయారు. ‘డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ప్రత్యేకంగా దర్శనమా..’ అని ఆడిగినందుకు పైశాచికంగా దాడికి పాల్పడ్డారు.

కాగా, దేవుడి దర్శనానికి వచ్చిన భక్తుడిని కొట్టడంపై తోటి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ అధికారులు, సెక్కూరిటీ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు.

Read also : Nagarjuna University : మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు మూడో సెమిస్టర్ క్వశ్చన్ పేపర్.. దిక్కులు చూసిన విద్యార్థులు.!