కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం గోకులపాడులో దారుణం జరిగింది. నాటువైద్యం వికటించడంతో ఏడు సంవత్సరాల బాలుడు రాఘవేంద్ర మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో నివశించే లక్ష్మన్న, వెంకటేశ్వరమ్మకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. కొడుకు రాఘవేంద్రకు పుట్టుకతోనే మూగ. కాళ్లు, చేతులు కూడా సరిగ్గా పని చేయవు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో గురువారం గ్రామానికి వచ్చిన నాటు వైద్యులను ఆశ్రయించారు.
నాటువైద్యం చేసిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాఘవేంద్ర కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. తులసి ఆకులను తీసుకురమ్మని తండ్రి లక్ష్మన్నకు నాటు వైద్యులు చెప్పడంతో.. అది తెచ్చేలోగా నాటు వైద్యులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఇద్దరు నాటు వైద్యులు ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మృతి చెందడంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు నెలకున్నాయి.
Also Read:
Mystery Disease: పశ్చిమగోదావరి జిల్లా కొమరేపల్లిలో కలకలం.. అంతుచిక్కని వ్యాధితో పలువురికి అస్వస్థత