Kurnool: ‘ఆడుదాం ఆంధ్రా’లో ఆటగాళ్ల మధ్య ఘర్షణ.. పిడిగుద్దులు కురిపించుకున్న వైనం.. వీడియో

| Edited By: Basha Shek

Jan 18, 2024 | 1:35 PM

నంద్యాల జిల్లా అవుకు లోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఆటగాళ్ల మధ్య కొట్లాట జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ తన్నుకున్నారు. దీంతో ఒక్కసారిగా క్రీడా ప్రాంగణం మొత్తం గందరగోళంగా మారింది.

Kurnool: ఆడుదాం ఆంధ్రాలో ఆటగాళ్ల మధ్య ఘర్షణ.. పిడిగుద్దులు కురిపించుకున్న వైనం.. వీడియో
Adudam Andhra
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట క్రీడాకారులు సహనం కోల్పోయి తన్నుకుంటున్న ఘటనలు తరుచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా అవుకు లోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఆటగాళ్ల మధ్య కొట్లాట జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ తన్నుకున్నారు. దీంతో ఒక్కసారిగా క్రీడా ప్రాంగణం మొత్తం గందరగోళంగా మారింది. బుధవారం కబడ్డీ పోటీల్లో భాగంగా అవుకు – ఉప్పలపాడు జట్లు తలపడ్డాయి. మ్యాచ్ చివర్లో ఇరు జట్ల మధ్య పాయింట్ల విషయంలో వ్యత్యాసం రావడంతో గొడవ ఆరంభమైంది. దీంతో క్రీడాకారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవ పెద్దది కావడంతో అక్కడున్న నిర్వాహకులు, క్రీడాకారులు నివ్వెరపోయారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లను చెదరగొట్టారు. చివరికి ఈ పంచాయతీ గ్రామ పెద్దల వద్దకు వెళ్లింది . గ్రామ పెద్దలు ఇరువురి జట్ల సభ్యులను పిలిపించి వారిమధ్య సయోధ్య కుదుర్చి పంపారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

కబడ్డీ క్రీడాకారుల ఘర్షణ.. వీడియో

 

 

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..