ED Inspections In Kurnool District : కర్నూలు జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మిగనూరులో ఒకచోట నంద్యాలలో నాలుగు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారికి డబ్బులు ట్రాన్సాక్షన్ పై అధికారులు స్పై విచారణ చేస్తున్నారు. వీళ్లంతా ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే మునిసిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల డబ్బులు చేతులు మారాయని ఈడీ పలుమార్లు ఆరోపిస్తుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.