Andhra Pradesh: అమ్మ బాబోయ్ ఇదెక్కడి యుద్ధం.. పిడకలతో కొట్టుకుంటున్న జనాలు..

యుద్ధం అంటే దురాక్రమణ కోసం కాదు.. సరిహద్దులు చెరిపేసుకుని, భూభాగాలను కలిపేసుకునే యుద్ధం అసలే కాదు. ఇది పిడకల యుద్ధం.. అవును మీరు వింటుంది నిజంగా నిజం. ఈ యుద్ధంలో మానవ హననం సృష్టించే..

Andhra Pradesh: అమ్మ బాబోయ్ ఇదెక్కడి యుద్ధం.. పిడకలతో కొట్టుకుంటున్న జనాలు..
Kurnool Festival

Updated on: Mar 22, 2023 | 9:40 PM

యుద్ధం అంటే దురాక్రమణ కోసం కాదు.. సరిహద్దులు చెరిపేసుకుని, భూభాగాలను కలిపేసుకునే యుద్ధం అసలే కాదు. ఇది పిడకల యుద్ధం.. అవును మీరు వింటుంది నిజంగా నిజం. ఈ యుద్ధంలో మానవ హననం సృష్టించే మిస్సైల్స్‌ అక్కర్లేదు. అత్యాధునిక యుద్ధరీతులూ అక్కర్లేదు. శతృత్వం కోసం కూడా ఈ యుద్ధం జరగదు. ప్రేమ కోసం మాత్రమే ఈ యుద్ధం. అది కూడా త్రేతాయుగం నాటి ప్రేమ కథా యుద్ధమిది. అయితే ఈ యుద్ధానికి కావాల్సిందల్లా తట్ట నిండా పిడకలూ, గురిచూసి విసిరే నేర్పూ ఉంటే చాలు.

అయితే ఈ యుద్ధాన్ని చూడాలంటే మాత్రం.. కర్నూలు జిల్లాకు వెళ్ళాల్సిందే. ఒకే గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, పిడకల సమరంలో తలపడతారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కైరుప్పల గ్రామంలో ప్రతియేటా జరిగే ఈ యుద్ధం త్రేతాయుగంలో కాళికా మాతకు, వీరభద్రస్వామి మధ్య జరిగిన ప్రేమ, పెళ్లి గొడవేనంటారు. ఈ పిడకల యుద్ధం తర్వాత కాళికా మాత, వీరభద్రస్వామికి కల్యాణం జరిపిస్తారు.

ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళీ వీరభద్ర స్వామి రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ భద్రకాళీ అమ్మ వీరభద్ర స్వామి పల్లకోత్సవం.. సాయంత్రం సాంప్రదాయ క్రీడ పిడకల సమరం నిర్వహిస్తారు. అనంతరం, ఆలయంలో ఉన్న విభూతిని గాయాలకు రాసుకుంటారు గ్రామస్తులు. విభూతి రాసుకుంటే తమ గాయాలు నయం అవుతాయని వాళ్ల నమ్మకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..