
వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ తిసుకొచ్చిన ఇచ్చిన స్వీగ్వీ యాప్, రెస్టారెంట్స్ నిర్వాహకులకు ఊహించిన షాక్ తగిలింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న స్విగ్గి యాప్ ఎండి, సిబ్బందికి కర్నూలు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(కన్జ్యూమర్ ఫోరం) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకు చెందిన ఓ వినియోగదారుడు గత ఏడాది డిసెంబర్లో స్విగ్గి యాప్ ద్వారా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని న్యూ అప్సర హోటల్లో వెజిటబుల్ బిర్యాని ఆర్డర్ చేశారు. స్విగ్గి అందించిన పార్సిల్ లో చికెన్ ముక్కలు ఉండటంతో మనస్థాపన చెందిన ఆ కస్టమర్.. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (కన్జ్యూమర్ ఫోరం) కి ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్ ఇరువురి వాదనలు విన్న కమిషన్ స్విగ్గి నిర్వాహకులు ఇతర ప్రతివాదులు కలిపి ఫిర్యాదుదారుకు 50వేల రూపాయలు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ. 5,000 చెల్లించాలని గత ఏడాది డిసెంబర్ 31న ఆదేశించింది. అయితే స్విగ్గి నిర్వాహకులు కమిషన్ ఆదేశాలను పాటించకపోవడంతో పలుమార్లు నోటీసులు జారీ చేసింది. గురువారం తమ ముందు హాజర అవ్వాలని నోటీసులు ఇచ్చిన… వారు స్పందించలేదు.
ఇక దీన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్.. బెంగళూరులోని స్విగ్గి ఎండి, ఆ సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, బండ్ల టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీవెన్స్ ఆఫీసర్, న్యూ అప్సర హోటల్ మేనేజర్‌కు నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. కేసు విచారణను ఈ ఏడాది జూన్ 22 కు వాయిదా వేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.