Kalva Bugga Koneru: ఎండిపోతున్న వందల ఏళ్ల నాటి కోనేరు.. అరిష్టంగా భావిస్తున్న భక్తులు

| Edited By: Surya Kala

Nov 14, 2023 | 10:27 AM

కాల్వబుగ్గ అంటేనే కోనేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడి కోనేరులో భక్తులు స్నానం ఆచరించి దైవ దర్శనం చేసుకుంటారు. ఈ కోనేరులోకి నిత్యం నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆలయం ప్రతిష్టించబడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రవహిస్తూనే ఉండేది. ఈసారి మాత్రం ప్రవాహం ఆగిపోయింది తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

Kalva Bugga Koneru: ఎండిపోతున్న వందల ఏళ్ల నాటి కోనేరు.. అరిష్టంగా భావిస్తున్న భక్తులు
Kalva Bugga Koneru
Follow us on

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల ప్రభావం సీరియస్ గా ఉంది. వర్షాలు లేకపోవడంతో తాగు సాగునీటికే కాదు ఆలయాల పైన కూడా పడింది. వందల ఏళ్ల నాటి కోనేరులు ఎండిపోతుండటంతో భక్తులు అరిష్టంగా భావిస్తున్నారు. కాల్వ బుగ్గరామేశ్వర స్వామి ఆలయం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ శైవ క్షేత్రం. కార్తీక మాసంలో శివరాత్రి సమయంలో ఆలయం కిక్కిరిసిపోతుంది. కర్నూలు..చెన్నై జాతీయ రహదారికి పక్కనే ఈ పురాతన ఆధ్యాత్మిక చారిత్రాత్మక బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం ఉంది. స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ కొన్ని వందల ఏళ్ల క్రితమే ప్రతిష్టింపబడినట్లు స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. కాల్వబుగ్గ అంటేనే కోనేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడి కోనేరులో భక్తులు స్నానం ఆచరించి దైవ దర్శనం చేసుకుంటారు. ఈ కోనేరులోకి నిత్యం నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆలయం ప్రతిష్టించబడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రవహిస్తూనే ఉండేది. ఈసారి మాత్రం ప్రవాహం ఆగిపోయింది తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

కాల్వబుగ్గ కోనేరు

నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి కోనేరులోకి కొంచెం నీరు వచ్చి చేరింది. ఆ తర్వాత ఆగిపోయింది. కోనేరు పురాతన కాలం నిర్మించిన బావి ఎండిపోవడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత కార్తీక మాసం కావడంతో భారీ సంఖ్యలో ఆలయాన్ని భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. అయితే ఇపుడు బావిలోని నీరు తగ్గిపోవడంతో భక్తి భావం తగ్గిపోయి తప్పుడు దారి పడుతుండటమే కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. అయినా బుగ్గ రామేశ్వర స్వామి ప్రజలపై కరుణాకటాక్షాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు అంటున్నారు.

మహానంది లాగే కాల్వబుగ్గ కోనేరు కూడా నిత్యం ప్రవహిస్తూ చుట్టుపక్కల ఉండే భూములకు సాగునీటిని కూడా ఇచ్చి సస్యశ్యామలం చేస్తూ ఉండేది. ప్రస్తుతం ఎండి పోవడంతో పంటలకు కూడా నీరు అందడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..